Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
COMPOSITION & LYRICS
Vandemataram Srinivas
Vandemataram Srinivas
Composer
Jonnavitthula
Jonnavitthula
Songwriter

Lyrics

రామా రామా అందరి బంధువయా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయా ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయా ఆ అయోధ్య రామయ్య చేయూత నిచ్చే వాడయ్య మా సీతారామయ్య చేయూత నిచ్చే వాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య అందరి బంధువయా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయా ఆ అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహా విష్ణు అవతారమయా ఆలిని రక్కసుడు అపహరించితే ఆక్రోశించెనయా అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా చాకలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ఆ ఆ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్య కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా అందరి బంధువయా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయా ఆ అయోధ్య రామయ్య భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయా సీతా రామ లక్ష్మణులకు ఆభరణములే చేయించెనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేష తీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా ఆ ఆ రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన (జన్మ ధన్యమయ్యా) (అందరి బంధువయా భద్రాచల రామయ్య) (ఆదుకునే ప్రభువయా ఆ అయోధ్య రామయ్య) (చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య) (కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య) (అందరి బంధువయా భద్రాచల రామయ్య) (ఆదుకునే ప్రభువయా ఆ అయోధ్య రామయ్య)
Writer(s): Vandemataram Srinivas, Jonnavitthula Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out