Lyrics

ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ఎక్కడున్నాగాని దిక్కువారేకదా చిక్కులను విడదీసి దరిజేర్చలేరా ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు అలమేలుమంగపతి అవనిలో ఒకడే ఏడుకొండలవాడు ఎల్లవేల్లలయందు దోగాడు బాలునికి తోడునీడౌతాడు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు నెల్లూరి సీమలో చల్లంగ శయనించు శ్రీరంగనాయకా ఆనందదాయకా తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు ఎల్లలోకాలకు తల్లివై నీవుండ పిల్లవానికి ఇంక తల్లి ప్రేమా కొరత బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు కరుణించి కాపాడు మా కనకదుర్గా ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి బాధలను తీర్చేటి భద్రాద్రివాసా ఆ బాధలను తీర్చేటి భద్రాద్రివాసా నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా చిన్నారి బాలునకు శ్రీ రామ రక్ష ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు బాల ప్రహ్లాదుని లాలించి బ్రోచిన నారసింహుని కన్నా వేరు దైవము లేడు అంతు తెలియగారాని ఆవేదనలు గలిగి అంతు తెలియగారాని ఆవేదనలు గలిగి చింతలను తొలగించు సింహాచలేశ ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కన్ని పాపను ఇక్కడుంచారు
Writer(s): Arudra, Pendyalaya Nageswara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out