Lyrics

ఎన్నాళ్లని ఎన్నేళ్లని నీ మనసుకు ఈ ఉజువు విహరించని స్వేచ్ఛగా ఏ వైపుకు ఏ వేటకు క్షణమాగని నీ పరుగు ఈ లోకమే నీదిగా అదుపెరగని తూనీగ బ్రతికిన మూనాళ్లు తనకేంటని దర్జాగా ఊరేగగా అర విరిసిన హరివిల్లు అర నిమిషం ఉన్నా పలు రంగులు జగమంతా పంచేయదా ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే మురిసే నిను గని ప్రతి హృదయం మురిసే మనసే లోలోనా ఇరుకైపోయేలా పెరిగే పేరాసే బరువై కూర్చుందా మదిలో కొలువైన ఆ కంచెనే దాటి చెలిమే పంచేటి చేయందుకో మళ్లీ పసిపాపలా అమ్మ ఒడి చేరి బ్రతుకును ఒక వరముగ నువు మార్చేసుకో ప్రతి నిమిషం పండగలా గడిపెయ్ నువ్వే ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే మురిసే నిను గని ప్రతి హృదయం మురిసే ఎగిసే నీ మది కెరటంలా ఎగిసే మురిసే నిను గని ప్రతి హృదయం మురిసే
Writer(s): Sricharan Pakala Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out