Lyrics

ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను... నాపై ఆశలు నిలుపుకున్న... నా తల్లి ఋణము చెల్లించనైతిని నాపై ఆశలు నిలుపుకున్న... నా తల్లి ఋణము చెల్లించనైతిని ఎవరికీ గాక... ఏ దరిగానక ఎవరికీ గాక... ఏ దరిగానక చివికి చివికి నే మ్రోడైపోతిని ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను... నన్నే దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని నన్నే దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... ఈ బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... ఈ బండలలో ఒక బండనైతిని ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను... వలచిన కన్యను వంచనజేసి... నలుగురిలో తలవంపులుజేసి వలచిన కన్యను వంచనజేసి... నలుగురిలో తలవంపులుజేసి గుండె ఆవిరైపోవుచుండ... ఈ గుండె ఆవిరైపోవుచుండ ఈ మొండి బ్రతుకు నేనీడ్చుచుంటిని ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ ఒంటరినైపోయాను... నే ఒంటరినైపోయాను...
Writer(s): Joseph Krishnamurthy, Dr. C Narayana Reddy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out