Lyrics

మిస మిస లాడే చిన్నదానా ముసి ముసి నవ్వుల నెరజాణా సిగ్గులు చిలికి సింగార మొలికి చేరగ రావేమే నా చెంతకు రావేమే సొగసరి చూపుల చినవాడా గడసరి మాటల మొనగాడా సరసాలాడే సరదా తీరే సమయం రానీ రా ఆ సమయం రానీ రా చారెడు కళ్లకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టి చారెడు కళ్లకు కాటుక పెట్టి దోసెడు మల్లెలు సిగలో చుట్టి చిలకలాగ నువు కులుకుతు ఉంటే ఒలికి పోతదే నీ సొగసు ఉలికి పడతదే నా మనసు కులుకు చూసి నువు ఉలికితివా తళుకు చూసి నువు మురిసితివా కులుకు చూసి నువు ఉలికితివా తళుకు చూసి నువు మురిసితివా కులుకును మించిన తళుకును మించిన వలపే దాచితి లేరా అది కలకాలం నీదేరా మిస మిస లాడే చినదాన ముసి ముసి నవ్వుల నెరజాణ సిగ్గులు చిలికి సింగార మొలికి చేరగ రావేమే నా చెంతకు రావేమే ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకుని ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకొని నీటి అద్దమున నీడ చూసుకుని గువ్వల జంటగ నువ్వు నేను కువ కువ లాడుతు ఉందామా కొత్త రుచులు కనుగొందామా కళ్లు కళ్లు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే ఓ ఓ కళ్లు కళ్లు కలిసిన నాడే మనసు మనసు తెలిసిన నాడే నీవు నేను ఒకటైనామని కోవెల గంటలు పలికెనులే దీవెనలై అవి నిలిచెనులే దీవెనలై అవి నిలిచెనులే మిస మిస లాడే చినదాన ముసి ముసి నవ్వుల నెరజాణా సిగ్గులు చిలికి సింగార మొలికి చేరగ రావేమే నా చెంతకు రావేమే సొగసరి చూపుల చినవాడా గడసరి మాటల మొనగాడా సరసాలాడే సరదా తీరే సమయం రానీ రా ఆ సమయం రానీ రా
Writer(s): Dr. C Narayana Reddy, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out