Lyrics

అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా అందినంత అప్పుచేసి మీసం మెలిదిప్పరా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా ఉన్నవారు లేనివారు రెండేరెండు జాతులురా ఉన్నచోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా వేలిముద్ర వేయరా సంతకాలు చేయరా అంతగాను కోర్టుకెళితె ఐ.పి. బాంబుందిరా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా రూపాయే దైవమురా రూపాయే లోకమురా రూక లేనివాడు భువిని కాసుకు కొఱగాడురా అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా
Writer(s): Pingali, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out