Lyrics

ఓ ఆ ఆ ఆ ఓ చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా నిలుపుకొందురా వెల్గులమేడ నీలికురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల కనులముందు అలలు పొంగెనూ ఓ మనసులోన కలలు పండెనూ కనులముందు అలలు పొంగెనూ ఓ మనసులోన కలలు పండెనూ అలలే కలలై . కలలే అలలై. అలలే కలలై . కలలే అలలై. గిలిగింతలు సలుపసాగెనూ ఊ ఊ ఊ చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ కొండలు కోయని పిలిచినవీ ఆ ఆ ఆ గుండెలు హోయని పలికినవీ ఆ ఆ ఆ కొండలు కోయని పిలిచినవీ ఆ ఆ ఆ గుండెలు హోయని పలికినవీ కోరికలన్నీ బారులుతీరీ కోరికలన్నీ బారులుతీరీ గువ్వలుగా ఎగురుతున్నవీ ఈ ఈ ఈ నీలికురుల వన్నెల జవరాలా నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల జగము మరచి ఆడుకొందమా ఆ ఆ ఆ ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ జగము మరచి ఆడుకొందమా ఆ ఆ ఆ ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ నింగీ నేలా కలిసిన చోటా నింగీ నేలా కలిసిన చోటా నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ చిలిపికనుల తీయని చెలికాడా నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
Writer(s): Dr. C Narayana Reddy, S Rajeshwara Rao Lyrics powered by www.musixmatch.com
Get up to 2 months free of Apple Music
instagramSharePathic_arrow_out